ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని అక్కచెరువుపాలెంలో ఈతకు వెళ్లిన ఆరుగురు చిన్నారులు నీటిలో మునిగి దుర్మరణం పాలయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకోగా.. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విషాదం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా (prakasam district) జరుగుమల్లి మండలంలోని అక్కచెరువుపాలెంలో ఈతకు వెళ్లిన ఆరుగురు చిన్నారులు నీటిలో మునిగి దుర్మరణం పాలయ్యారు. వీరిని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని నాలుగు మృతదేహాలను వెలికి తీయగా .. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఒకేరోజు ఆరుగురు చిన్నారులు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
