వంశధారలో చిక్కుకున్న 53 మంది.. సురక్షితంగా తెచ్చిన సహాయక బృందాలు

First Published 16, Jul 2018, 11:08 AM IST
53 workers rescued from Vamsadhara river at srikakulam district
Highlights

శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదిలో చిక్కుకుపోయిన 53 మంది కూలీలను సహాయక బృందాలు క్షేమంగా ఒడ్డుకు చేర్చాయి. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో వంశధార నది పొంగిపొర్లుతోంది.

శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదిలో చిక్కుకుపోయిన 53 మంది కూలీలను సహాయక బృందాలు క్షేమంగా ఒడ్డుకు చేర్చాయి. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో వంశధార నది పొంగిపొర్లుతోంది. ఈ క్రమంలో నదీలో 53 మంది కూలీలు చిక్కుకుపోయారు..  వీరంతా నదీ గర్భంలో ఇసుకను తవ్వేందుకు వెళ్లిన కూలీలు, డ్రైవర్లు.. వరద ఉధృతి పెరగడంతో వీరంతా సమీపంలోని రాళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడాల్సిందిగా సమాచారం అధికారులకు సమాచారం అందించారు.

అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బందిన కొన్ని గంటల పాటు శ్రమించారు.. ఈ ఆపరేషన్ ముగిసే వరకు అక్కడున్న వారంతా ఊపిరి బిగబెట్టుకుని చూస్తూ కూర్చొన్నారు. వారి శ్రమ ఫలించి కూలీలంతా ప్రాణాలతో బయటపడటంతో అధికారులు, స్థానికులు రెస్క్యూ సిబ్బందిని అభినందించారు.

మరోవైపు వంశధార నదిలో చిక్కుకున్న 53 మందిని సురక్షితంగా కాపాడిన అధికారులను, సహాయక బృందాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు.. కూలీలు నదిలో చిక్కుకున్న సమాచారం తెలిసిన దగ్గరి నుంచి ఆయన సచివాలయం నుంచి సహాయకచర్యలను పర్యవేక్షిస్తూనే ఉన్నారు. 
 

loader