ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,145 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,44,864కి చేరింది.

నిన్న ఒక్కరోజే వైరస్ కారణంగా 31 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 6,159కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 6,110 మంది కోవిడ్ నుంచి కోలుకోవడంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ల సంఖ్య 6,91,040కి చేరింది.

ప్రస్తుతం ఏపీలో 47,665 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న ఒక్కరోజే 70,521 శాంపిల్స్‌ను పరీక్షించడంతో మొత్తం టెస్టుల సంఖ్య 64,20,474కి చేరుకుంది.

అనంతపురం 285, చిత్తూరు 757, తూర్పు గోదావరి 738, గుంటూరు 342, కడప 352, కృష్ణ 310, కర్నూలు 211, నెల్లూరు 310, ప్రకాశం 486, శ్రీకాకుళం 139, విశాఖపట్నం 159, విజయనగరం 194, పశ్చిమ గోదావరిలలో 862 కేసులు నమోదయ్యాయి.

అలాగే వైరస్ కారణంగా ప్రకాశం 5, చిత్తూరు 4, విశాఖపట్నం 4, అనంతపురం 3, తూర్పుగోదావరి 3, కృష్ణ 3, నెల్లూరు 3, గుంటూరు, కడప, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరిలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.