ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పడిపోతూనే వున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 50 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 8,88,605కి చేరింది.

కరోనా కారణంగా నెల్లూరులో ఒకరు మరణించారు. దీంతో కలిపి వైరస్ బారినపడి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,161కి చేరింది. గడిచిన 24 గంటల్లో 121 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వీ

టితో కలిపి ఇప్పటి వరకు ఏపీలో డిశ్చార్జ్‌ల సంఖ్య 8,80,559కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 845 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్క రోజు 28,418 మందికి కోవిడ్ టెస్టులు చేయడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా నిర్ధారణా పరీక్షల సంఖ్య 1,34,22,878కి  చేరుకుంది.

గత 24 గంటల్లో అనంతపురం 2, చిత్తూరు 13, తూర్పు గోదావరి 4, గుంటూరు 4, కడప 2, కృష్ణా 8, కర్నూలు 0, నెల్లూరు 5, ప్రకాశం 1, శ్రీకాకుళం 2, విశాఖపట్నం 8, విజయనగరం 1, పశ్చిమగోదావరిలలో 0 కేసులు నమోదయ్యాయి.