కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే  తండ్రి మేడా రామకృష్ణారెడ్డి కారులో నుండి రూ. 50 లక్షలతో డ్రైవర్ పారిపోయాడు. కర్నూల్ జిల్లాలోని ఓ హోటల్ వద్ద  కారును నిలిపిన సమయంలో డ్రైవర్ ఈ నగదుతో పారిపోయాడు.


కర్నూల్: కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే తండ్రి మేడా రామకృష్ణారెడ్డి కారులో నుండి రూ. 50 లక్షలతో డ్రైవర్ పారిపోయాడు. కర్నూల్ జిల్లాలోని ఓ హోటల్ వద్ద కారును నిలిపిన సమయంలో డ్రైవర్ ఈ నగదుతో పారిపోయాడు. 

టీటీడీ బోర్డు సభ్యుడుగా మేడా రామకృష్ణారెడ్డి కొనసాగుతున్నారు. రాజంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడా మల్లిఖార్జున రెడ్డి తండ్రి మేడా రామకృష్ణారెడ్డి. మేడా రామకృష్ణారెడ్డి కర్నూల్‌లోని దాబా వద్ద ఆగిన సమయంలో కారులో ఉన్న రూ. 50 లక్షల నగదును తీసుకొని కారు డ్రైవర్ పారిపోయాడని మేడా రామకృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కారు డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కారు డ్రైవర్ ఎక్కడికి వెళ్లాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ డబ్బుతో కారు డ్రైవర్ ఎటు వెళ్లాడనే విషయమై పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు.