Asianet News TeluguAsianet News Telugu

తిరుమలలో అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం..

తిరుమలలో కిడ్నాప్ కు గురైన బాలుడి కేసు సుఖాంతం అయ్యింది. బాలుడు మైసూరులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ చేసిన మహిళ తల్లిదండ్రులే బాలుడిని పోలీసులకు అప్పగించారు. 

5 years old boy kidnapped out side tirumala temple found in mysore
Author
Hyderabad, First Published May 5, 2022, 7:57 AM IST

తిరుమల : andhrapradesh రాష్ట్రంలో అదృశ్యమైన boy ఆచూకీ లభ్యమైంది. మతిస్థిమితం లేని మహిళ బాలుడిని అపహరించినట్లు తెలుస్తోంది. ఆ మహిళ తల్లిదండ్రులే బాలుడిని పోలీసులకు అప్పగించినట్లు చెబుతున్నారు. మూడు రోజుల క్రితం బాలుడు tirumala templeలో అదృశ్యమయ్యాడు. మతిస్థిమితం లేని మహిళ బాలుడిని కిడ్నాప్ చేసి మైసూరుకు వెళ్లింది. మహిళపై మైసూరులో missing case నమోదైంది.

కాగా, ఈ ఆదివారం సాయంత్రం తిరుమలలో బాలుడి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. తిరుమలలోని గొల్లమండపం సమీపంలో ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని మహిళ ఐదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసింది. ఈ ఘటనపై సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా  బాలుడుని కిడ్నాప్ చేసిన మహిళ ఎక్కడికి వెళ్లిందని ట్రాక్ చేస్తున్నారు. అయితే, బాలుడి కిడ్నాప్ జరిగి 24 గంటలు గడిచినా ఆచూకీ లభించకపోవడంతో బాలుడి తల్లి తీవ్ర ఆందోళన చెందింది.

వివరాలు.. కిడ్నాప్ అయిన బాలుడి కుటుంబం తిరుపతి సమీపంలోని దామినేడు ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటుంది. బాలుడి తండ్రి హోటల్‌లో పనిచేస్తాడు. తల్లి స్వాతి శ్రీవారి ఆలయానికి సమీపంలో భక్తుల నుదుట గోవింద నామాలు పెడుతూ అలా వచ్చిన డబ్బులతో జీవిస్తున్నారు. రోజూలాగే ఆదివారంకూడా స్వాతి తన పనిలో నిమగ్నమై ఉండగా శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న గొల్లమండపం సమీపంలో ఉన్న బాలుడి వద్దకు ఓ మహిళ వచ్చింది. కాసేపు అతనితో మాట్లాడుతూ గడిపింది. ఆ తరువాత పిల్లాడికి కొన్ని స్వీట్లు ఇచ్చింది. సాయంత్రం 5.15 గంటలకు బాలుడిని తనతోపాటు తీసుకుని వెళ్లిపోయింది. 

బాబు రోజూలాగే ఆడుకుంటున్నాడు అనుకున్న స్వాతి.. సాయంత్రం 5.45 గంటలకు కొడుకు కనిపించడంలేదని గుర్తించింది. దీంతో గుడి చుట్టుపక్కల అంతా వెతికింది. అయినా ఆచూకీ లభించకపోవడంతో సోమవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సీసీ టీవీ ఫుటేజ్ను పరిశీలించారు.  నీలి రంగు చొక్కా,  లేత గోధుమ రంగు ప్యాంటు ధరించిన బాలుడిని..  పింక్ చుడిదార్ ధరించిన మహిళ తీసుకుని వెళుతున్నట్లుగా గుర్తించారు.  ఆదివారం రాత్రి ఏడు గంటలకు.. మహిళ తో కలిసి బస్సులో తిరుపతి వెళుతున్నట్లుగా పోలీసులు కనుగొన్నారు.

 తిరుపతి లోని సీసీటీవీ ఫుటేజీ ద్వారా మహిళా రాత్రి  8.10 గంటల ప్రాంతంలో బాలుడిని గోవిందరాజ స్వామి ఆలయానికి,  అక్కడి నుంచి 8.50 గంటలకు  విష్ణు నివాసం యాత్రికుల సౌకర్యాల సముదాయానికి తీసుకు వెళ్లినట్లు గుర్తించామని తిరుమల సర్కిల్ ఇన్స్పెక్టర్ కె  చంద్రశేఖర్ తెలిపారు.  ఆ తర్వాత సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఆమె రైల్వే స్టేషన్ లో కనిపించింది అక్కడ ట్రైన్ టిక్కెట్ కొనుగోలు చేసి..  ప్లాట్ఫారం నెంబర్  2, నాలుగు ల లో తిరుగుతూ కనిపించింది.  చివరిగా ఆమె సోమవారం తెల్లవారు జామున నాలుగున్నర గంటలకు కనిపించింది.  ఆ తర్వాత ఆమె కదలికలను పోలీసులు గుర్తించలేకపోయారు.

దీంతో పోలీసులు ఆ సమయంలో తిరుపతి నుంచి బయలుదేరే  రైళ్ల షెడ్యూలు ఆధారంగా నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి,  వివిధ రైల్వే స్టేషన్లకు పంపారు.  ఇందుకు సంబంధించి ఐపిసి సెక్షన్ 363 కింద కేసు నమోదు చేసి.. బాలుడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగించారు. ఇక బాలుడిని తీసుకుని వెళ్లి ఉండవచ్చునని పోలీసులు అనుమానించారు.  మహిళ  ఫోటోలు కూడా పోలీసులు విడుదల చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios