Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో ఎన్‌కౌంటర్: మావో అగ్రనాయకురాలు అరుణ హతం

విశాఖ జిల్లాలో తుపాకులు గర్జించాయి. జీకే వీధి మండలం మాదిగమలలులో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోలు హతమయ్యారు. ధారకొండ ఏజెన్సీలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

5 maoists killed in encounter in visakhapatnam district
Author
Visakhapatnam, First Published Sep 22, 2019, 2:26 PM IST

విశాఖ జిల్లాలో తుపాకులు గర్జించాయి. జీకే వీధి మండలం మాదిగమలలులో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోలు హతమయ్యారు. ధారకొండ ఏజెన్సీలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ఈ నెల 21 నుంచి 28 వరకు ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టు వారోత్సవాలు జరుగుతుండటంతో ఎస్పీఎఫ్, గ్రేహౌండ్స్ దళాలు కూంబింగ్ నిర్వహించాయి.

ఈ క్రమంలో గుమ్మిరేవులలో మావోలు ఉన్నట్లుగా భద్రతా దళాలకు సమాచారం అందడంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దీంతో ఇరువర్గాలకు ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 

కాగా ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించినవారిలో మావోయిస్టు పార్టీ అగ్రనాయకురాలు అరుణ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈస్ట్‌జోన్‌కు వచ్చిన అరుణ గత కొంతకాలంగా విశాఖ మన్యంలో పార్టీ కార్యకలాపాలను కొనసాగితస్తున్నారు.

ఏడాది క్రితం అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోము హత్యకు అరుణే పథకం రచించినట్లు పోలీసులు నిర్థారించారు. గతంలో ఆమె పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకుంది. 
 
Follow Us:
Download App:
  • android
  • ios