చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. గుంటూరుకు చెందిన ఓ కుటుంబం కారులో తిరుమలకు వెళ్తుండగా రేణిగుంట మండలం గురవరాజుపల్లి దగ్గర ఆగివున్నలారీని వీరి వాహనం ఢీకొట్టింది.

ఈఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రగాయాలైన ఐదుగురిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.