తిరుమల శ్రీవారి ఆలయంలోని ప్రసాదాలు తయారు చేసే పోటులో ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ వున్న బాయిలర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులకు గాయాలయ్యాయి.

వెంటనే అప్రమత్తమైన టీటీడీ అధికారులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రసాదాలు తయారు చేసే వకుళామాత పోటులో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో సుమారు 40 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు.

పులిహోర ప్రసాదం కోసం చింతపండు రసం వేడి చేస్తుండగా బాయిలర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.