కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. హనుమాన్ జంక్షన్ సమీపంలో ఆటోను కారు ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా.. మరో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉంది.

మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

గత శనివారం చిత్తూరు జిల్లా గంగవరం వద్ద కారు అదుపు తప్పి బోల్తాపడటంతో అగ్నిప్రమాదం సంభవించి.. ఐదుగురు సజీవదహనమైన సంగతి తెలిసిందే.