Asianet News TeluguAsianet News Telugu

83 పంచాయతీల్లో రేపు 4వ దశ ఎన్నికలు : ఇప్పటికే మూడు ఏకగ్రీవాలు..

గుంటూరులో రేపు  4దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 83పంచాయతీలలో ఎన్నికలు జరుగుతాయని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. ఇప్పటికే 3 పంచాయతీల్లో ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు. 

4th stage local body elections in guntur - bsb
Author
Hyderabad, First Published Feb 20, 2021, 2:09 PM IST

గుంటూరులో రేపు  4దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 83పంచాయతీలలో ఎన్నికలు జరుగుతాయని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. ఇప్పటికే 3 పంచాయతీల్లో ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు. 

ఈ 83 పంచాయతీల్లో 280వార్డులు ఉన్నాయన్నారు. వీటిలో 25 అత్యంత సమశ్యాత్మక ప్రాంతాలుగా గుర్తించాం అని తెలిపారు. ఈ అన్ని కేంద్రాల్లో పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు.

ఉదయం 5.30 నుంచి కౌంటింగ్ మొదలవుతుందని... అప్పటి నుంచి కౌంటింగ్ పూర్తై సిబ్బంది, అధికారులు ఇళ్లకు చేరుకునే వరకూ పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశామని అమ్మిరెడ్డి చెప్పుకొచ్చారు. ఎన్నికలు జరిగే 6మండలాల్లో  2మండలాలకు ఒక ఏఎస్పీకి బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. 

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటి వరకూ 173 కేసులో 1973 మందిని బైడోవర్ చేశామని తెలిపారు. పోలీసులతో పాటు ఏసీబీ, స్పెషల్ ప్రొటెక్షన్ పోర్సుని కూడా ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. అర్బన్ పరిధిలో 8చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేశామని, అక్రమంగా తరలిస్తున్న 30వేల బాటిల్స్, 13లక్షల క్యాష్ పట్టుకున్నామని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios