ఆంధ్రప్రదేశ్‌లో నాలుగో విడత పంచాయతీ పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. క్యూలైన్‌లో వున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగో విడత పంచాయతీ పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. క్యూలైన్‌లో వున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది.

కాసేపట్లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు 78.9 శాతం పోలింగ్ నమోదైంది. విజయనగరం జిల్లాలో అత్యధికంగా 85.60 శాతం పోలింగ్ నమోదవ్వగా.. నెల్లూరులో అత్యల్పంగా 73.20 పోలింగ్ శాతం నమోదైంది.

శ్రీకాకుళం 78.81, విజయనగరం 85.60, విశాఖ 84.07, తూర్పుగోదావరి 74.99, పశ్చిమ గోదావరి 79.03, కృష్ణ 79.29, గుంటూరు 76.74, ప్రకాశం 78.77, నెల్లూరు 73.20, చిత్తూరు 75.68, కడప 80.68, కర్నూలు 76.52, అనంతపురంలలో 82.26 శాతం పోలింగ్ నమోదైంది.

ఇక నాలుగు విడత పంచాయతి ఎన్నికల్లో పలు గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. సత్తెనపల్లి నియోజకవరంలోని లక్కరాజు గార్ల పాడు, ధూళిపాళ్ల, ఫణిదం గ్రామాల్లో ఘర్షణలు జరిగాయి. ధూళిపాళ్ల గ్రామం లో పోలింగ్ ఏజెంట్ల మధ్య ఘర్షణ జరగగా ఏజెంట్లకు గాయాలయ్యాయి.