ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 479 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,78,285కి చేరింది. నిన్న ఒక్క రోజు కోవిడ్ కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

దీంతో మొత్తం మరణాల సంఖ్య 7074కి చేరాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 4,355 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 497 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. వీటితో కలిపి మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,66,856కి చేరుకుంది.

నిన్న 62,215 శాంపిల్స్‌ను పరీక్షించడంతో మొత్తం టెస్టుల సంఖ్య 1,11,96,574కి చేరింది. అనంతపురం 13, చిత్తూరు 87, తూర్పుగోదావరి 47, గుంటూరు 62, కడప 23, కృష్ణ 92, కర్నూలు 26, నెల్లూరు 16, ప్రకాశం 21, శ్రీకాకుళం 10, విశాఖపట్నం 47, విజయనగరం 13, పశ్చిమ గోదావరిలలో 22 కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వల్ల చిత్తూరు, గుంటూరు, కృష్ణ, పశ్చిమ గోదావరిలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.