ఏపీలో దిగొచ్చిన కరోనా కేసులు.. 24 గంటల్లో 4,605 మందికి పాజిటివ్, గోదావరి జిల్లాల్లో తీవ్రత
ఆంధ్రప్రదేశ్‌లో (corona cases in ap) కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 4,605 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 22,93,171కి చేరుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో (corona cases in ap) కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 4,605 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 22,93,171కి చేరుకుంది. నిన్న మహమ్మారి వల్ల అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో ఇద్దరు చొప్పున.. చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,641కి చేరుకుంది.
24 గంటల్లో కరోనా నుంచి 11,729 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 21,85,042కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 35,578 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,25,71,365కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 93,488 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 218, చిత్తూరు 290, తూర్పుగోదావరి 642, గుంటూరు 524, కడప 413, కృష్ణ 477, కర్నూలు 318, నెల్లూరు 501, ప్రకాశం 342, శ్రీకాకుళం 105, విశాఖపట్నం 219, విజయనగరం 17, పశ్చిమ గోదావరిలలో 539 చొప్పున వైరస్ బారినపడ్డారు.
మరోవైపు దేశంలో కరోనా కేసులు (Corona Cases) స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 1,72,433 కరోనా కేసులు నమోదయ్యాయి. కిందటి రోజుతో పోలిస్తే కొత్త కేసులు 6.8 శాతం పెరిగాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 1,008 కరోనా మరణాలు (Corona Deaths) చోటుచేసుకున్నాయి. ఇందులో కేరళకు చెందిన 355 బ్యాక్ లాగ్ మరణాల గణంకాలు కూడా ఉన్నాయి. తాజా మరణాలతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 4,98,983కి చేరింది. తాజాగా దేశంలో కరోనా నుంచి 2,59,107 కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనాను జయించిన వారి సంఖ్య 3,97,70,414కి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 15,33,921గా ఉంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.
ఇక, దేశంలో కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 10.99 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 12.98 శాతంకు చేరింది. దేశంలో కరోనా రికవరీ రేటు 95.14 శాతం, మరణాల రేటు 1.19 శాతం, యాక్టివ్ కేసులు 3.67 శాతంగా ఉన్నాయి. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. నిన్న దేశంలో 55,10,693 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,67,87,93,137కి చేరింది. దేశంలో బుధవారం (ఫిబ్రవరి 2) రోజున 15,69,449 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 73,41,92,614 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా తెలిపింది.