Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో నిలకడగా కరోనా ఉద్ధృతి, కొత్తగా 4198 మందికి పాజిటివ్... ఏ జిల్లాల్లో ఎక్కువంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 4,198 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. నిన్న మహమ్మారి వల్ల చిత్తూరులో ఇద్దరు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో కరోనా నుంచి 9,317 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 21,94,359కి చేరింది.

4198 new corona cases reported in andhra pradesh
Author
Amaravathi, First Published Feb 4, 2022, 7:32 PM IST

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 4,198 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 22,97,369కి చేరుకుంది. నిన్న మహమ్మారి వల్ల చిత్తూరులో ఇద్దరు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,646కి చేరుకుంది. 

24 గంటల్లో కరోనా నుంచి 9,317 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 21,94,359కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 30,886 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,26,02,251కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 88,364 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 245, చిత్తూరు 293, తూర్పుగోదావరి 555, గుంటూరు 485 కడప 228, కృష్ణ 528, కర్నూలు 459 నెల్లూరు 378, ప్రకాశం 221, శ్రీకాకుళం 73 విశాఖపట్నం 233, విజయనగరం 54, పశ్చిమ గోదావరిలలో 446 చొప్పున వైరస్ బారినపడ్డారు.

ఇదిలావుండ‌గా, దేశంలో నిత్యం ల‌క్ష‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. అయితే, ఈ వారం ప్రారంభం నుంచి కోవిడ్‌-19 కొత్త కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన క‌రోనా వైర‌స్ వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 1,49,394 క‌రోనా కేసులు న‌మోద‌య్య‌యి. దీంతో దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,19,52,712కు చేరింది. కొత్త‌గా 2,46,674 మంది కోవిడ్‌-19 నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోవిడ్ రివ‌క‌రీల సంఖ్య 4,00,17,088కి పెరిగింది. ప్ర‌స్తుతం  14,35,569 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా వుండ‌గా, దేశంలో కోవిడ్‌-19 కొత్త కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్న‌ప్ప‌టికీ.. మ‌ర‌ణాలు క్రమంగా పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. 

గ‌త 24 గంట‌ల్లో క‌రోనా వైర‌స్ తో పోరాడుతూ 1,072 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 5,00,055కు పెరిగింది. దేశంలో ప్ర‌స్తుతం రోజువారీ సానుకూలత రేటు 11% నుండి 9.27%కి పడిపోయింది. వీక్లీ క‌రోనా వైర‌స్ పాజిటివిటీ రేటు 12.03%కి తగ్గింది. క‌రోనా నియంత్ర‌ణ కోసం కోవిడ్‌-19 ప‌రీక్ష‌ల‌తో పాటు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రంగా నిర్వ‌హిస్తోంది అధికార యంత్రాంగం. ఇప్ప‌టివర‌కు దేశంలో మొత్తం 168.5 కోట్ల కోవిడ్‌-19 టీకాల‌ను పంపిణీ చేసిన‌ట్టు ప్ర‌భుత్వం పేర్కొంది. ఇందులో మొద‌టి డోసుల సంఖ్య 89.8 కోట్లు ఉండ‌గా, రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 72.1 కోట్ల మంది ఉన్నారు. 

అలాగే, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 73,41,92,614 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్టు భార‌తీయ వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్) వెల్ల‌డించింది. గురువారం ఒక్క‌రోజే 15,69,449 కోవిడ్‌-19 శాంపిళ్ల‌ను ప‌రీక్షించిన‌ట్టు తెలిపింది. ప్రస్తుతం దేశంలో కోవిడ్ మ‌ర‌ణాల రేటు 1.19 శాతంగా ఉంది. అటు దేశంలో క‌రోనా మ‌ర‌ణాలు ఐదు ల‌క్ష‌లు దాటాయి. కరోనా మరణాలు ఐదు లక్షలు దాటిన మూడో దేశంగా భారత్ నిలిచింది. అత్యధికంగా 9.1 లక్షల మరణాలతో అమెరికా మొదటి స్థానంలో ఉండ‌గా, ఆ త‌ర్వాతి స్థానంలో 6.3 లక్షల మరణాలతో బ్రెజిల్ రెండో స్థానం కొన‌సాగుతోంది. 3.3 లక్షల మరణాలతో రష్యా నాలుగో స్థానంలో, 3.07 లక్షలతో మెక్సికో ఐదో స్థానంలో  ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios