కడప జిల్లాలో గురువారం నాడు  విషాదం చోటు చేసుకొంది. ఈతకు వెళ్లిన నలుగురు యువకులు  పెన్నానదిలో నలుగురు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి యువకుల డెడ్‌బాడీలను వెలికితీశారు.  మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

కడప: కడప జిల్లాలో గురువారం నాడు  విషాదం చోటు చేసుకొంది. ఈతకు వెళ్లిన నలుగురు యువకులు  పెన్నానదిలో నలుగురు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి యువకుల డెడ్‌బాడీలను వెలికితీశారు.  మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.జిల్లాలోని  వల్లూరు మండలం పుష్పగిరిలో  పెన్నానదిలో  ఈతకు నలుగురు యువకులు వెళ్లారు.

ఈతకు వెళ్లిన యువకులు ప్రమాదవశాత్తు నదిలో గల్లంతయ్యారు.  వీరిలో ఇద్దరి డెడ్‌బాడీలు లభ్యమయ్యాయి. మిగిలినవారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  గల్లంతైన వారంతా కడప బెల్లమండివీధికి చెందినవారిగా గుర్తించారు.గతంలో కూడ పెన్నానదిలో  ఈతకు వెళ్లి పలువురు గల్లంతైన ఘటనలు చోటు చేసుకొన్నాయి.  ఈ తరహా ఘటనలు చోటు చేసుకొన్న సమయంలో  హాడావుడి  చేయడం మినహా ఇతర సమయాల్లో మాత్రం పట్టించుకోవడం లేదని అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.