Asianet News TeluguAsianet News Telugu

కర్నూలు: అతిసార పంజా.. నలుగురి మృతి, గ్రామం విడిచిపోతున్న జనం

కర్నూలు జిల్లా గోరుకల్లు గ్రామానికి అతిసార భయం పట్టుకుంది. కలుషిత నీరు తాగి నలుగురు మృతిచెందిన ఘటనతో భయాందోళనలకు గురవుతున్నారు గ్రామస్తులు. ప్రాణభయంతో ఊరు వదిలి వెళ్లిపోతున్నారు

4 person died due to effected by diarrhea at gorakallu in kurnool district ksp
Author
Kurnool, First Published Apr 7, 2021, 2:29 PM IST

కర్నూలు జిల్లా గోరుకల్లు గ్రామానికి అతిసార భయం పట్టుకుంది. కలుషిత నీరు తాగి నలుగురు మృతిచెందిన ఘటనతో భయాందోళనలకు గురవుతున్నారు గ్రామస్తులు. ప్రాణభయంతో ఊరు వదిలి వెళ్లిపోతున్నారు.

తమ సొంత గ్రామం వదిలి బంధువుల ఊరు వెళ్లి గోరుకల్లు వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోరుకల్లు, ఆదోని పరిసర ప్రాంతాల్లో అతిసార బారినపడి సుమారు 100 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

లక్షణాలు కనిపించిన వారంతా నంద్యాల ప్రభుత్వాసుపత్రికి పోటెత్తుతున్నారు. అయితే నిన్న ఒకేరోజు ఇద్దరు చనిపోవడంతో అధికారులు అప్రమత్తమై గ్రామానికి చేరుకున్నారు.

ఈ గ్రామానికి గోరుకల్లు రిజర్వాయర్ నుంచి మంచినీటి సరఫరా జరుగుతుంది. నీటి సరఫరాలో లీకేజ్ కారణంగానే అతిసార ప్రబలినట్లు అధికారులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios