వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం..
వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి సమీపంలో ఆర్టీసీ బస్సు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.

వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి సమీపంలో ఆర్టీసీ బస్సు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని స్థానికులు, పోలీసులు సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఈ ప్రమాదంలో మృతిచెందినవారిని మహమ్మద్, హసీనా, అమీనా, షాకీర్‌లు గుర్తించారు. వీరంతా కడప జిల్లా ఆజాద్ నగర్ కాలనీకి చెందినవారు. అయితే వీరు ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా ధ్వంసం అయింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.