కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెన్నానదిలో పడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పుణేకు చెందిన కొందరు సిద్ధవటంలోని పెన్నా నది వద్దకు విహారయాత్ర కోసం వచ్చారు. ఈ క్రమంలో కొందరు నదిలో ఈతకెళ్లి నలుగురు మరణించారు. మృతుల్లో ముగ్గురు యువతులు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.