విశాఖలో విషాదం: పెద్దవాగులో మునిగి నలుగురు చిన్నారుల మృతి

విశాఖ జిల్లా వి. మాడుగుల మండలం జమ్మాదేవిపేటలో విషాదం ఏరు దాటుతూ నలుగురు పిల్లలు మృతి చెందారు. సోమవారం నాడు ఈ నలుగురు పిల్లలు వాగు దాటుతూ నీటిలో కొట్టుకుపోయారు. వీరంతా ఎల్.గవరవరం గ్రామానికి చెందినవారే.

4 children drown in Visakhapatnam district lns

విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లాలోని వి. మాడుగుల మండలం జమ్మాదేవిపేటలో సోమవారం నాడు విషాదం చోటు చేసుకొంది. వాగు దాటుతూ నలుగురు చిన్నారులో మునిగిపోయారు.  దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.ఎల్.గవరవరం గ్రామానికి చెందిన చిన్నారులు మహేందర్, వెంకటజాన్సీ, జాహ్నవి, షర్మిలలు పెద్దఏరు దాటుతూ నీటిలో మునిగిపోయారు. నీటి ఉధృతికి వారంతా కొట్టుకుపోయారు. ఈ నలుగురి వయస్సు  10 ఏళ్లలోపే ఉంటుంది. 

ఓకే గ్రామానికి చెందిన నలుగురు నీటిలో కొట్టుకొనిపోయి చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.ఈ విషయమై బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాలను వాగు నుండి వెలికితీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు పోలీసులు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

రాష్ట్రంలో ఇటీవల కాలంలో కురిసిన వర్షాలతో చెరువులు, వాగులు నీటితో నిండిపోయాయి. అయితే ఈ నెల 28వ తేదీ తర్వాత మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖాధికారులు హెచ్చరిస్తున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios