ఏపీలో అత్యల్ప స్థాయికి కరోనా: 500 దిగువకు రోజువారీ కేసులు.. 20,57,145కి చేరిన సంఖ్య
ఏపీలో కొత్తగా 332 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 585 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 6,193 మంది చికిత్స పొందుతున్నారు
ఆంధ్రప్రదేశ్‌లో (corona cases in ap) గడిచిన 24 గంటల్లో కొత్తగా 332 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,57,145కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,302కి చేరుకుంది.
గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల కడప 2, కృష్ణా 2, తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 585 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,36,650 కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 29,243 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 6,193 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 7, చిత్తూరు 55, తూర్పుగోదావరి 32, గుంటూరు 42, కడప 43, కృష్ణ 32, కర్నూలు 3, నెల్లూరు 22, ప్రకాశం 25, శ్రీకాకుళం 4, విశాఖపట్నం 28, విజయనగరం 3, పశ్చిమ గోదావరిలలో 36 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.
ALso Read:కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా కావాలంటే.. పెట్రోల్ ధరలు పెరుగుతాయి...కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్..!
కాగా, త్వరలోనే 2-18 ఏళ్లలోపు పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన covaxin కరోనా వ్యాక్సిన్ కు కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్ అందించింది.కోవాగ్జిన్ corona vaccine ను చిన్న పిల్లలకు అత్యవసర వినియోగం కింద అందించేందుకు నిపుణుల కమిటీ మంగళవారం నాడు అనుమతిని ఇచ్చింది. కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను మూడు రకాల వయస్సు పిల్లలపై ప్రయోగించారు. 12 -18 ఏళ్లు, 6-12 ఏళ్లు, 2-6 ఏళ్ల మధ్య పిల్లలపై ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించారు.తొలుత 12-18 ఏళ్ల పిల్లలపై ఈ వ్యాక్సిన్ ను పరిశీలించారు.
ఆ తర్వాత ఇతర వయస్సు పిల్లలపై ఈ వ్యాక్సిన్ ప్రభావం ఎలా ఉంటుందనే విషయమై ప్రయోగాలు చేసినట్టుగా ఎయిమ్స్ ప్రోఫెసర్ డాక్టర్ సంజయ్ రాయ్ చెప్పారు.ఈ వ్యాక్సిన్ తీసుకొన్న పిల్లల్లో తేలికపాటి ఇన్‌ఫెక్షన్లు మాత్రమే ఉన్నాయని గుర్తించామని వైద్య నిపుణులు చెప్పారు.. జలుబు, స్వల్పమైన తలనొప్పిని మాత్రమే గుర్తించామన్నారు..ఈ వ్యాక్సిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఇంకా ఆమోదం లభించలేదు. దీనికి త్వరలోనే ఆమోదం లభించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.