30 రోజుల్లో చంద్రబాబు ఎన్ని పనులు చేశారో తెలుసా?

గడిచిన నెల రోజులుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సహా మంత్రులందరూ బిజీబిజీగా గడుపుతున్నారు. నిత్యం సమీక్షలు, సమావేశాలతో తమ శాఖల పరిధిలోని అంశాలపై పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు శ్రమిస్తున్నారు.

30 days of Chandrababu's administration GVR

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం దూసుకెళ్తోంది. సంక్షేమం, అభివృద్ధిని సమ్మిళితంగా ప్రజలకు చేరువ చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. అధికారంలోకి వచ్చింది మొదలు.. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలపై శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది చంద్రబాబు ప్రభుత్వం. రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువుదీరి నేటికి సరిగ్గా నెల రోజులు అయింది. ఈ నెల రోజుల్లో ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలు చేపట్టింది.  

ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీల ఎన్‌డీయే కూటమి అఖండ మెజారిటీతో విజయం సాధించింది. రాష్ట్రంలోని 164 అసెంబ్లీ, 21 పార్లమెంటు స్థానాల్లో మూడు పార్టీల అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ ఏడాది మే 13న ఎన్నికలు జరగ్గా.. జూన్ 4 ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహించారు. అదేరోజు ఫలితాలు వెలువడ్డాయి. అప్పటికి అధికారంలో ఉన్న వైసీపీ 11 సీట్లకు పరిమితం కాగా, ఎవరూ ఊహించని విధంగా అత్యధిక స్థానాలతో కూటమి అధికారంలోకి వచ్చింది. అనంతరం జూన్‌ 12న ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను అమలు చేసే దిశగా తొలి అడుగులోనే చర్యలు చేపట్టారు. 

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ప్రకటించిన ఐదు హామీల అమలుకు సిద్ధమయ్యారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై తొలి సంతకం చేశారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, సామాజిక పింఛన్ పెంపు, స్కిల్ సెన్సన్స్ ప్రక్రియ చేపట్టడం, అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభం ఫైళ్లపై సంతకాలు చేశారు. ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు ఐదు శాఖల మంత్రిగా కీలక బాధ్యతలు అప్పగించారు. చంద్రబాబుతో పాటు 24 మందికి రాష్ట్ర మంత్రి పదవులు కేటాయించారు. తొలి అడుగులోనే ఐదు హామీలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు... ఆ తర్వాత జరిగిన తొలి కేబినెట్‌ సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

గడిచిన నెల రోజులుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సహా మంత్రులందరూ బిజీబిజీగా గడుపుతున్నారు. నిత్యం సమీక్షలు, సమావేశాలతో తమ శాఖల పరిధిలోని అంశాలపై పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు శ్రమిస్తున్నారు. అలాగే, గత ప్రభుత్వం చేసిన లోపభూయిష్టమైన నిర్ణయాలను వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు. అలా, 30 రోజుల్లోనే పరిపాలనపై పట్టు సాధించడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలుకు అడుగులు వేశారు. కొత్త ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన ముప్పై రోజుల్లో చేసిన 30 కార్యక్రమాలు ఏంటంటే...


1. 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ 

2. వృద్ధాప్య, వితంతు పింఛను రూ.4000కి పెంపు 

3. దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేసి రూ.6000కి పెంపు 

4. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దే పింఛను పంపిణీ

5. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు 

6. ఉచిత ఇసుక అమలు (లోడింగ్, రవాణా చార్జీలు చెల్లించాలి)

7. ఆగస్టు 15 నుంచి 183 అన్న క్యాంటీన్లు ప్రారంభం 

8. గంజాయి, డ్రగ్స్ కట్టడికి చర్యలు 

9. ఎర్ర చందనంపై ఉక్కుపాదం 

10. రాజధాని అమరావతి పనులు ప్రారంభం 

11. పోలవరం నిర్మాణం పునః ప్రారంభం

12. స్కిల్ సెన్సెస్ కసరత్తు ప్రారంభం 

13. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం మార్గదర్శకాలు విడుదల 

14. జగన్ బొమ్మతో ఉన్న పాసుపుస్తకాల స్థానంలో రాజముద్రతో పాసుపుస్తకాలు 

15. పట్టిసీమ మొదలు పెట్టి, కృష్ణా డెల్టాకి నీరు విడుదల 

16. 48 గంటల్లోనే అత్యాచారం చేసిన నిందితుల అరెస్ట్ 

17. భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులు 2026కి పూర్తిచేయాలని ఆదేశం 

18. తిరుమల ప్రక్షాళన ప్రారంభం 

19.అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్రం అనుమతి 

20. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన అందిన జీతాలు 

21. ఏపీలో రూ.70 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్న బీపీసీఎల్ 

22. రాజధానిలో XLRI విద్యా సంస్థ 

23. ఐదేళ్ల తరువాత పలాసకు సాగునీరు 

24. ఐదేళ్ల తరువాత పిఠాపురానికి పురుషోత్తపట్నం నీళ్లు 

25. ఒక్క వాట్సప్ కాల్‌తో 25 మంది దివ్యాంగ విద్యార్థులకు అండగా నారా లోకేష్ 

26. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు 

27. తెలంగాణతో విభజన సమస్యలపై ముందడుగు 

28. విజయవాడ తూర్పు బైపాస్‌కి కేంద్రం ఆమోదం 

29. నిత్యావసర ధరల నియంత్రణకు చర్యలు (రైతు బజార్లలో తక్కువ రేట్లకే బియ్యం, కంది పప్పు)

30. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. ప్రధాని, కేంద్ర మంత్రులకు రాష్ట్ర సమస్యలపై వినతి

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios