ముగ్గురికీ కేజీహెచ్‌ వైరాలజీ ప్రయోగశాలలో నిర్ధరణ పరీక్షలు చేయగా వారికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు వెల్లడైంది. ముగ్గురికి అయిదారు రోజులుగా జ్వరం ఉందని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. 

విశాఖ జిల్లాలో మరోసారి స్వైన్ ఫ్లూ కలకలం రేపింది. విశాఖలో ముగ్గురికి స్వైన్ ఫ్లూ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. వీరిలో 15 ఏళ్ల బాలిక నగరంలోని ఛాతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మరో ఇద్దరు నగరంలోని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జ్వర బాధితుల్లో ఓ ఐపీఎస్‌ అధికారి ఉన్నట్లు సమాచారం. 

ముగ్గురికీ కేజీహెచ్‌ వైరాలజీ ప్రయోగశాలలో నిర్ధరణ పరీక్షలు చేయగా వారికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు వెల్లడైంది. ముగ్గురికి అయిదారు రోజులుగా జ్వరం ఉందని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. జ్వరం తీవ్రత కూడా తగ్గుముఖం పట్టిందని వివరించారు.