ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యర్రగొండపాలెం మండలం కొత్తపల్లి వద్ద కారు, ఆటో ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యర్రగొండపాలెం మండలం కొత్తపల్లి వద్ద కారు, ఆటో ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆటోలో ఉన్నవారు మిర్చి కోతకు వెళ్లివస్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్టుగా సమాచారం. మృతుల్లో ఆటో ప్రయాణిస్తున్న ఇద్దరు, కారులో ప్రయాణిస్తున్న ఒక్కరు ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
