ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల్లో భారీ తగ్గదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 2,930 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 18,96,853కి చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల్లో భారీ తగ్గదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 2,930 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 18,96,853కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 36 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 12,815కి చేరుకుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి అనంతపురం 2, ప్రకాశం 3, తూర్పుగోదావరి 5, నెల్లూరు 1, చిత్తూరు 6, గుంటూరు 4, కర్నూలు 4, కృష్ణ 2, విశాఖపట్నం 2, విజయనగరం 1, శ్రీకాకుళం 3 కడపలో ముగ్గురు ఒక్కరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 4,346 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 18,48,167కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 90,532 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,22,68,483కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 35,871 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 100, చిత్తూరు 443, తూర్పుగోదావరి 591, గుంటూరు 236, కడప 117, కృష్ణ 204, కర్నూలు 119, నెల్లూరు 185, ప్రకాశం 363, శ్రీకాకుళం 105, విశాఖపట్నం 70, విజయనగరం 59, పశ్చిమ గోదావరిలలో 338 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

Scroll to load tweet…