ఏపీలో శనివారం కరోనా వైరస్ కేసులు అత్యల్ప స్థాయిలో నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 42,911 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 282 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 8,80,712కి చేరింది. నిన్న ఒక్కరోజే 442 మంది కోవిడ్‌ 19 నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,69,920కి చేరుకుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 3,700 యాక్టివ్ కేసులు వున్నాయి. గత 24 గంటల్లో ఇప్పటి వరకు 1,15,74,117 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం తాజా బులెటిన్‌లో పేర్కొంది. నిన్న ఒక్కరోజు కోవిడ్ కారణంగా ఒకే ఒక్కరు మరణించారు.

అనంతపురం 10, చిత్తూరు 39, తూర్పు గోదావరి 53, గుంటూరు 56, కడప 15, కృష్ణ 38, కర్నూలు 1, నెల్లూరు 16, ప్రకాశం 1, శ్రీకాకుళం 4, విజయనగరం 4, విశాఖపట్నం 18, పశ్చిమ గోదావరిలలో 27 కేసులు నమోదయ్యాయి.