ఫంక్షన్ నిర్వాకం: ఏపీలో ఒకే గ్రామంలో 27 మందికి కరోనా పాజిటివ్
విజయనగరం జిల్లాలోని బొబ్బిలి మండలం ముత్తాయివలసలో 27 మందికి కరోనా సోకింది. మరికొందరికి కరోనా సోకే అవకాశం ఉందని వైద్యులు అనుమానిస్తున్నారు. దీంతో గ్రామాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు.
విజయనగరం: విజయనగరం జిల్లాలోని బొబ్బిలి మండలం ముత్తాయివలసలో 27 మందికి కరోనా సోకింది. మరికొందరికి కరోనా సోకే అవకాశం ఉందని వైద్యులు అనుమానిస్తున్నారు. దీంతో గ్రామాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు.
ముత్తాయివలస గ్రామంలో నిర్వహించిన ఓ ఫంక్షన్ కారణంగా కరోనా వైరస్ కేసులు నమోదైనట్టుగా గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఫంక్షన్ హాజరైన వారిని పరీక్షిస్తే 27 మందికి కరోనా సోకిందని తేలింది. మరికొందరికి కూడ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. దీంతో ఈ గ్రామంలో కరోనా కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
గ్రామస్తులకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.ఒకేసారి గ్రామంలో 27 మందికి కరోనా సోకడంతో గ్రామాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. కరోనా సోకినవారిని ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ముందు జాగ్రత్తగా వైద్యులు పరీక్షిస్తున్నారు.
రాష్ట్రంలో కరోనా కేసులు 23,814కి చేరుకొన్నాయి. గత 24 గంటల్లో 1555 కేసులు నమోదయ్యాి. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటివరకు 272 మంది మరణించారు. రాష్ట్రంలో 11,383 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాలో అత్యధిక కేసులు రికార్డయ్యాయి. కర్నూల్ తర్వాతి స్థానంలో అనంతపురం జిల్లా నిలిచింది.