ఏపీలో కొత్తగా 2,591 మందికి పాజిటివ్.. 19,26,684కి చేరిన మొత్తం కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 2591 కేసులు నమోదవ్వగా.. 15 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న కోవిడ్ నుంచి 3,329 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 25,957 మంది చికిత్స పొందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు నిలకడగానే కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 2,591 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,26,684కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,057కి చేరుకుంది.
గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి తూర్పుగోదావరి 2, చిత్తూరు 4, ప్రకాశం 3, శ్రీకాకుళం2, అనంతపపురం, కర్నూలు, విజయనగరం, పశ్చిమ గోదావరిలలో ఒక్కరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 3,329 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 18,87,670కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 90,204 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,32,20,912కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 25,957 మంది చికిత్స పొందుతున్నారు.
నిన్న ఒక్కరోజు అనంతపురం 69, చిత్తూరు 349, తూర్పుగోదావరి 511, గుంటూరు 219, కడప 217, కృష్ణ 190, కర్నూలు 29, నెల్లూరు 162, ప్రకాశం 251, శ్రీకాకుళం 62, విశాఖపట్నం 220, విజయనగరం 46, పశ్చిమ గోదావరిలలో 266 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.