అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మహిళలపై తేనేటీగల దాడి: 25 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వన బోజనాలకు వెళ్లిన మహిళలపై తేనేటీగలు దాడికి దిగాయి. తేనేటీగల దాడిలో 25 మంది మహిళలు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా మారింది.
అమలాపురం:అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వన భోజనాలకు వెళ్లిన మహిళలపై తేనేటీగలు దాడి చేశాయి. జిల్లాలోని ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో మహిళలపై తేనేటీగలు దాడి చేశాయి. వనభోజనాలకు వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో 25 మంది మహిళలకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని గాయపడిన మహిళలను ఆసుపత్రికి తరలించారు.కార్తీక మాసంలో సాధారణంగా వన బోజనాలకు వెళ్తుంటారు. అంకంపాలెం గ్రామానికి చెందిన గ్రామస్తులు వన బోజనానికి వెళ్లారు. వనభోజనానికి వెళ్లిన సమయంలో తేనేటీగలు దాడి చేశాయి. ఈ దాడితో పలువురు మహిళలు గాయపడ్డారు.
గతంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో తేనేటీగల దాడులు జరిగిన ఘటనల్లో పలువురు గాయపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో పరీక్ష రాసేందుకు వెళ్లిన విద్యార్థులపై తేనేటీగలు దాడి చేశాయి. ఈ ఏడాది మార్చి 19న ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు.పరీక్ష రాసేందుకు వెళ్తున్న విద్యార్ధులు, సిబ్బందిపై తేనేటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్ వద్ద తేనేతుట్టె ఉంది.
ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని తేనేటీగల దాడిలో డివిజనల్ ఇంజనీర్ భాను ప్రకాష్ మృతి చెందారు. బనకచర్ల హెడ్ రెగ్యేలేటరీ తనిఖీ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో భానుప్రకాష్ సహా 10 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన భానుప్రకాష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన 2020 సెప్టెంబర్ 22న చోటు చేసుకుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2020 మే 31న ప్రముఖ నటుడు చిరంజీవి కుటుంబసభ్యులపై తేనేటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు.