ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,367 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 8,40,730కి చేరింది.

నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 6,779కి చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో 21,434 మంది చికిత్స పొందుతున్నారు.

మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,12,517కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 80,082 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించడంతో ఇప్పటి వరకు మొత్తం పరీక్షల సంఖ్య 85,87,312కి చేరింది. 

నిన్న అనంతపురం 61 , చిత్తూరు 255, తూర్పుగోదావరి 386, గుంటూరు 226, కడప 131, కృష్ణ 358, కర్నూలు 37, నెల్లూరు 153, ప్రకాశం 84, శ్రీకాకుళం 102, విశాఖపట్నం 135, విజయనగరం 78, పశ్చిమ గోదావరి 361లలో కేసులు నమోదయ్యాయి.

కోవిడ్ వల్ల కృష్ణ 3, అనంతపురం 2, చిత్తూరు 2, తూర్పు గోదావరి, కడప, విశాఖపట్నం, పశ్చిమ గోదావరిలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.