ఏపీలో భారీగా తగ్గిన కరోనా వైరస్.: 214 కొత్త కేసులు, 2 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ భారీగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా 214 కోవిడ్ పాజిటివ్ కేసులు మాత్రమే రికార్డయ్యాయి. 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా ఇద్దరు మృత్యువాత పడ్డారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. పెద్ద యెత్తున విజృంభించిన కరోనాతో తల్లడిల్లిన ఏపీ క్రమంగా ఊరట పొందుతోంది. తాజాగా ఏపీలో 214 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా ఇద్దరు కోవిడ్ కారణంగా మరణించారు.
తాజా కేసులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 8.78 లక్షల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కారణంగా 7078 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు 8 లక్షల 64 వేల 972 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 3,992 మంది చికిత్స పొందుతున్నారు.
తాజాగా చిత్తూరు 46 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, అనంతపురం జిల్లాలో 17, తూర్పు గోదావరి జిల్లాలో 18, గుంటూరు జిల్లాలో 21 మంది కరోనా వైరస్ వ్యాధికి గురయ్యారు. కడప జిల్లాలో 11 మందికి, కృష్ణా జిల్ాలలో 23 మందికి, కర్నూలు జిల్లాలో 8 మందికి, నెల్లూరు జిల్లాలో 9 మందికి, ప్రకాశం జిల్లాలో 19 మందికి కరోనా వైరస్ సోకింది.
శ్రీకాకుళం జిల్లాలో 10, విశాఖపట్నం జిల్లాలో 20, విజయనగరం జిల్లాలో 4, పశ్చిమ గోదావరి జిల్లాలో 8 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాలవారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు ఇలా ఉన్నాయి.
అనంతపురం 67158, మరణాలు
చిత్తూరు 85507, మరణాలు 838
తూర్పు గోదావరి 123323, మరణాలు 636
గుంటూరు 74303, మరణాలు 661
కడప 54799స మపమయావు 455
కృష్ణా 47210, మరణఆలు 658
కర్నూలు 60498, మరణాలు 487
నెల్లూరు 61944, మరణాలు 505
ప్రకాశం 61930స మపయమావు 578
శ్రీకాకుళం 45843, మరణాలు 346
విశాఖపట్నం 58885, మరణాలు 549
విజయనగరం 40982, మరణాలు 238
పశ్చిమ గోదావరి 93660, మరణాలు 532