కరోనాను నిర్లక్ష్యం చేస్తే.. పొంచి ఉండి మరీ కాటేస్తోంది. కేసులు కాస్త తగ్గాయి, వ్యాక్సిన్ వచ్చిందన్న కారణంతో చాలామంది కనీస జాగ్రత్తలకు దూరంగా ఉంటున్నారు. దీంతో పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 

కరోనాను నిర్లక్ష్యం చేస్తే.. పొంచి ఉండి మరీ కాటేస్తోంది. కేసులు కాస్త తగ్గాయి, వ్యాక్సిన్ వచ్చిందన్న కారణంతో చాలామంది కనీస జాగ్రత్తలకు దూరంగా ఉంటున్నారు. దీంతో పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 

తాజాగా తూర్పుగోదావరి జిల్లా తొండంగిలో కరోనా కలకలం సృష్టించింది. ఓ ఉమ్మడి కుటుంబంలో 21 మందికి పాజిటివ్ నిర్థారణ అయ్యింది. తొండంగిలో ఓ ఇంట్లో ఏర్పాటు చేసిన భజన కార్యక్రమానికి ఆ కుటుంబంతో పాటు మరో నాలుగు కుటుంబాలూ పాల్గొన్నాయి. 

ఆ తర్వాత వీరిలో కొందరికి జ్వరం రావడంతో టెస్టులు చేయడా 21 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్యతోపాటు పజిటివ్ రేటు క్రమంగా పెరుగుతోంది. 

నాలుగు నెలల తర్వాత గరిష్టంగా 758 కేసులు నమోదయ్యాయి. గతేడాది నమోదైన కేసులే అత్యధికం. బుధవారం నాటి సంఖ్యతో పోల్చితే ఒక్కసారిగా 173 కేసులు పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఉదయం 9గం.ల నుంచి ఉదయం 9 గం.ల వరకు 35,196 నమూనాలను పరీక్షించగా.. 2.15 శాతం మంది వైరస్ బారిన పడ్డారు.

చిత్తూరు జిల్లాలో ఇద్దరు, గుంటూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. చిత్తూరులో వైరస్ ఉదృతి కొనసాగుతోంది. అత్యధికంగా ఈ జిల్లాలో 175 కేసులు రాగా, గుంటూరులో 127 మందికి పాజిటివ్ గా తేలింది. పశ్చిమ గోదావరిలో అత్యల్పంగా 13 కేసులు నమోదయ్యాయి. అన్ని జిల్లాల్లోనూ పాజిటివ్ కేసుల సంఖ్య రెండంకెలకు చేరింది.