ఏపీలో కొత్తగా 2,068 కరోనా కేసులు నమోదవ్వగా.. 22 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 2,127 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 21,198 మంది చికిత్స పొందుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌‌‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,068 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,61,222కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 22 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,354కి చేరుకుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి తూర్పుగోదావరి 1, చిత్తూరు 3, ప్రకాశం 6, కృష్ణ 4, గుంటూరు 3, విశాఖపట్నం 1, విజయనగరం 1, శ్రీకాకుళం 1, నెల్లూరులో ఇద్దరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 2,127 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 19,26,670కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 80,641 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,44,84,051కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 21,198 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 51, చిత్తూరు 315, తూర్పుగోదావరి 337, గుంటూరు 182, కడప 116, కృష్ణ 251, కర్నూలు 18, నెల్లూరు 205, ప్రకాశం 207, శ్రీకాకుళం 68, విశాఖపట్నం 90, విజయనగరం 30, పశ్చిమ గోదావరిలలో 198 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.


Scroll to load tweet…