అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కార్మికులను తరలిస్తున్న బస్సులు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో 20 మందికి గాయాలవ్వగా.. డ్రైవర్ కాళ్లు బస్సులో ఇరుక్కుపోయాయి. 

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కార్మికులను తరలిస్తున్న బస్సులు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. ముందు వెళ్తున్న బస్సు ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలవ్వగా.. డ్రైవర్ కాళ్లు బస్సులో ఇరుక్కుపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.