కర్నూల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు డాక్టర్లు న్యూఢిల్లీలో  అదృశ్యమయ్యారు.  ఇద్దరు డాక్టర్ల ఆచూకీ కోసం కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ కు చెందిన ముగ్గురు డాక్టర్లు హిమబిందు, శ్రీధర్, దిలీప్‌లు న్యూఢిల్లీలో ఉన్నారు. ఈ నెల 25వ తేదీన డాక్టర్ హిమబిందు, డాక్టర్  దిలీప్ లు చర్చికి వెళ్లి వస్తామని చెప్పి వెళ్లి ఇంతవరకు తిరిగి రాలేదు.

ఈ విషయమై డాక్టర్ హిమబిందు భర్త డాక్టర్ శ్రీధర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.