తుని: తూర్పుగోదావరి జిల్లా తునికి సమీపంలోని తాండవ నదిలో మట్టి పెళ్లలు కూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

తునికి సమీపంలో మట్టిని తవ్వుతుండగా ఐదుగురు కూలీలు మట్టి పెళ్లల కింద పడిపోయారు ఒక్కరు సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.విషయం తెలిసిన వెంటనే అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.