Asianet News TeluguAsianet News Telugu

పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం: కాలువలోకి దూసుకెళ్లిన కారు, ఇద్దరి మృతి

పశ్చిమగోదావరి జిల్లాలోని నిడమర్రు మండలం మండలపర్రు వద్ద కాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో  ఇద్దరు మృతి చెందారు. కారులో  నుండి రెండు మృతదేహలను పోలీసులు వెలికితీశారు. ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్రాల్లో ఈ తరహ ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చోటు చేసుకొంటున్నాయి.

2 dead after car falls into  canal in Andhrapradeshs Westgodavari district
Author
West Godavari, First Published Sep 21, 2021, 9:32 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం మండలపర్రు వద్ద కాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో  ఇద్దరు మృతి చెందారు.  ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం గ్రామానికి చెందిన బి. సుమంత్, కోడె. శరత్ లు మరణించినట్టుగా పోలీసులు తెలిపారు. వీరిద్దరూ కారులో భీమవరం నుండి నిడమర్రు వస్తుండగా మండలపర్రు వద్ద కారు అదుపుతప్పి చినకాపవరం కాలువలోకి దూసుకెళ్లింది.

కాలువలోకి కారు దూసుకెళ్లిన విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం ఆధారంగా పోలీసులు సంఘటనస్థలానికి చేరుకొని కారులో నుండి రెండు మృతదేహలను వెలికితీశారు. కారు కాలువలోకి దూసుకెళ్లడానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటనతో మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిిస్తున్నారు.

మృతదేహలను పోలీసులు పోస్టుమార్టం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కారు కాలువలో పడడానికి అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios