Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్: రెండు రోజుల్లో ఇద్దరు ఏపీ సచివాలయ ఉద్యోగుల మృతి

ఏపీ సచివాలయంలో పనిచేసే  ఉద్యోగులు ఇద్దరు కరోనాతో రెండు రోజుల వ్యవధిలో మరణించారు. దీంతో సచివాలయ ఉద్యోగులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 

2 AP Secretariat staff died due to corona lns
Author
Guntur, First Published Apr 18, 2021, 3:24 PM IST

అమరావతి: ఏపీ సచివాలయంలో పనిచేసే  ఉద్యోగులు ఇద్దరు కరోనాతో రెండు రోజుల వ్యవధిలో మరణించారు. దీంతో సచివాలయ ఉద్యోగులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.  ఏపీ సచివాలయంలోని ఆర్ధిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న  ఉద్యోగి  కరోనాతో  మరణించారు.ఏపీ సచివాలయం జీఏడీలో పనిచేస్తున్న ఉద్యోగి రవికాంత్  ఆదివారం నాడు కరోనాతో చనిపోయారు. 

రెండు రోజుల వ్యవధిలో  ఇద్దరు సచివాలయ  ఉద్యోగులు  చనిపోవడంతో  సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. శుక్రవారం నాడు  సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు.  ఈ ఫలితాలు  రావాల్సి ఉంది.  మరోవైపు తమకు వర్క్ ఫ్రం హోం కేటాయించాలని సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు.

గత ఏడాది కరోనా సమయంలో కొందరు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించింది. ప్రస్తుతం కూడ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో  మరోసారి ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరు కావాలంటే భయపడుతున్నారు. ఇంటి నుండే పనిచేసే వెసులుబాటును కల్పించాాలని కోరుతున్నారు. అయితే ఈ విషయమై ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందోననే  సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios