Asianet News TeluguAsianet News Telugu

సీఎం జగన్ గారు... నాకు న్యాయం చేయండి: కృష్ణా జిల్లా మహిళ ఆవేదన (వీడియో)

తన  భూమిని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాదు ఇదేంటని అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని కృష్ణా జిల్లాకు చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. 

2 acres land grabbing... women reauet to officials to do justice
Author
Gannavaram, First Published Aug 12, 2021, 10:29 AM IST

విజయవాడ: నకిలీ పత్రాలు సృష్టించి తన భూమిని కబ్జా చేశారని ఓ ఆడపడుచు ఆందోళన వ్యక్తం చేస్తున్న ఘటన గన్నవరం మండలపరిధిలో చోటుచేసుకుంది. అధికారులు కూడా  కబ్జాధారులకే వత్తాసు పలుకుతున్నారని... సీఎం జగన్, జిల్లా కలెక్టర్ స్పందించి తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ కోరుతోంది. 

వీడియో

బాధిత మహిళ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సవారిగూడెంకు చెందిన తిరుమలశెట్టి రాజ్యలక్ష్మకి సర్వే నెంబర్ 40/2 లో 2.35 ఎకరాల భూమి వుంది. అయితే ఈ భూమిపై కన్నేసిన విజయవాడకు చెందిన దివి సుబ్బారావు, ఆళ్ల సుభాషిణి నకిలీ పత్రాలతో రెండెకరాల భూమిని దొంగ రెజిస్ట్రేషన్ చేయించుకున్నారు. విషయం తెలిసి అధికారుల చుట్టూ ఎంత తిరిగినా తనకు న్యాయం జరగడం లేదని... అధికారులంతా కబ్జా చేసిన వారివైపే మాట్లాడుతున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. 

read more  యువకుడి ఆత్మహత్య.. ఎస్ఐ, కానిస్టేబుల్ సస్పెండ్

ఇక తన భూమిని కబ్జా చేయడమే కాదు ఇదేంటని ప్రశ్నిస్తే ఆ భూమి మాదేనంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని రాజ్యలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలనీ... రెండెకరాల భూమిని తిరిగి ఇప్పించాలని బాధితురాలు కోరుతోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios