ఏపీలో కరోనా విస్ఫోటనం: ఒక్కరోజులో 19,412 కేసులు.. చిత్తూరు, తూ.గోలో తీవ్రత

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,412 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

19412 new corona cases reported in andhra pradesh ksp

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,412 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

వీటితో కలిపి ఇప్పటి వరకు ఏపీలో వైరస్ బారినపడిన వారి సంఖ్య 11,21,102కి చేరింది. నిన్న ఒక్కరోజు కరోనా వల్ల రాష్ట్రవ్యాప్తంగా 61 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో మహమ్మారి వల్ల మరణించిన వారి సంఖ్య 8,053కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో విజయనగరం 8, విశాఖపట్నం 7, చిత్తూరు 7, తూర్పుగోదావరి 7, అనంతపురం 6, ప్రకాశం 5, కర్నూలు 5, కృష్ణ 5, నెల్లూరు 4, గుంటూరు 2, కడప 2, శ్రీకాకుళం 2, పశ్చిమగోదావరిలలో ఒక్కొరు చొప్పన ప్రాణాలు కోల్పోయారు.

నిన్న ఒక్కరోజు 11,579 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 9,82,297కి చేరుకుంది. గత 24 గంటల వ్యవధిలో 98,214 మందికి కోవిడ్ నిర్థారణా పరీక్షలు చేశారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు టెస్టుల సంఖ్య 1,64,88,574కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో 1,30,752 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో అనంతపురం 1722, చిత్తూరు 2768, తూర్పుగోదావరి 2679, గుంటూరు 1750, కడప 792, కృష్ణ 694, కర్నూలు 1381, నెల్లూరు 1091, ప్రకాశం 1106, శ్రీకాకుళం 2048, విశాఖపట్నం 1722, విజయనగరం 606, పశ్చిమ గోదావరిలలో 1053 కేసులు చొప్పున నమోదయ్యాయి. 

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios