ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కాస్తంత శాంతించినట్లుగా కనిపిస్తోంది. రెండ్రోజులుగా కేసుల సంఖ్యలో మార్పు వచ్చింది. కర్ఫ్యూతో పాటు ఆంక్షలు కట్టుదిట్టంగా అమలు చేస్తండటంతో అవి సత్పలలితాలను ఇస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కాస్తంత శాంతించినట్లుగా కనిపిస్తోంది. రెండ్రోజులుగా కేసుల సంఖ్యలో మార్పు వచ్చింది. కర్ఫ్యూతో పాటు ఆంక్షలు కట్టుదిట్టంగా అమలు చేస్తండటంతో అవి సత్పలలితాలను ఇస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో పాజిటివటి రేటు కూడా తగ్గినట్లు హెల్త్ సెక్రటరీ అశోక్ సింఘాల్ తెలిపారు. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 18,767 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 15,80,827కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 104 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 10,126కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 11, అనంతపురం 8, తూర్పుగోదావరి 8, చిత్తూరు 15, గుంటూరు 8, కర్నూలు 8, నెల్లూరు 6, కృష్ణ 8, విశాఖపట్నం 9, శ్రీకాకుళం 7, పశ్చిమ గోదావరి 13,, కడపలో ముగ్గురు చొప్పున మరణించారు.

నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 20,109 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 13,61,464కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 91,629 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,86,17,387కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,09,237మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 1846, చిత్తూరు 2323, తూర్పుగోదావరి 2887, గుంటూరు 1749, కడప 883, కృష్ణ 774, కర్నూలు 1166, నెల్లూరు 1045, ప్రకాశం 1162, శ్రీకాకుళం 971, విశాఖపట్నం 1668, విజయనగరం 821, పశ్చిమ గోదావరిలలో 1972 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

Scroll to load tweet…