ఏపీలో కొత్తగా 178 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 190 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,140 మంది చికిత్స పొందుతున్నారు 

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) గడిచిన 24 గంటల్లో 178 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,69,729కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,438కి చేరుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల గుంటూరులో ఇద్దరు, చిత్తూరు,కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నంలలో ఒకరు మృతి చెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 190 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,53,151కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 27,657 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,03,72,427కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,140 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 11, చిత్తూరు 21, తూర్పుగోదావరి 19, గుంటూరు 21, కడప 9, కృష్ణ 34, కర్నూలు 2, నెల్లూరు 8, ప్రకాశం 7, శ్రీకాకుళం 17, విశాఖపట్నం 11, విజయనగరం 1, పశ్చిమ గోదావరిలలో 17 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

Scroll to load tweet…