కొత్తగా 1,732 కేసులు.. తూర్పులో అత్యధికం: ఏపీలో 8.47 లక్షలకు చేరిన సంఖ్య
ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,732 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కోవిడ్ కేసులు 8,47,977కి చేరాయి.
ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,732 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కోవిడ్ కేసులు 8,47,977కి చేరాయి.
నిన్న ఒక్క రోజే వైరస్ కారణంగా 14 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య 6,828కి చేరాయి. ఏపీలో ప్రస్తుతం 20,915 యాక్టివ్ కేసులున్నాయి. ఇదే సమయంలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8.20 లక్షలకు చేరుకున్నాయి.
నిన్న ఒక్కరోజే వైరస్ నుంచి మంది పూర్తిగా కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 70,405 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా నిర్ధారణా పరీక్షల సంఖ్య 88.63 లక్షలకు చేరింది.
నిన్న ఒక్కరోజే అనంతపురం 97, చిత్తూరు 198, తూర్పుగోదావరి 344, గుంటూరు 195, కడప 88, కృష్ణ 246, కర్నూలు 24, నెల్లూరు 89, ప్రకాశం 24, శ్రీకాకుళం 59, విశాఖపట్నం 75, విజయనగరం 66, పశ్చిమ గోదావరిలలో 227 కేసులు నమోదయ్యాయి.
అలాగే కృష్ణా జిల్లా 3, అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరిలలో ఇద్దరు చొప్పున.. తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరులలో ఒక్కరు చొప్పున మరణించారు.