17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో: సజ్జల రామకృష్ణారెడ్డి సంచలనం
టీడీపీకి చెందిన 13 నుండి 17 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
అమరావతి: టీడీపీకి చెందిన 13 నుండి 17 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
Also read:నేడు జగన్‌తో భేటీ కానున్న కరణం బలరాం: వైసీపీలోకి కరణం కుటుంబం
గురువారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. స్వచ్చంధంగానే వైసీపీలో చేరేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీతో చర్చిస్తున్నారని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని వలసలు టీడీపీ నుండి తమ పార్టీలోకి ఉంటాయని ఆయన తేల్చి చెప్పారు.
టీడీపీ మునిగిపోతోందని చాలా మందికి అర్థమైందన్నారు. అందుకే తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. ఇప్పుడున్న టీడీపీ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ కాదన్నారు సజ్జల. స్తానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకొంటున్నారని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
నామినేషన్ వేయడానికి అవసరమైన ఎస్కార్ట్ ఇస్తామని కూడ ఆయన టీడీపీకి సూచించారు. ఓటమికి సాకులు వెతికే క్రమంలోనే నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకొంటున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం నత్వానీకి రాజ్యసభ టిక్కెట్టును కేటాయించామన్నారు.రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని నత్వానీ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన తెలిపారు.
సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, కనకమేడల రవీంద్రకుమార్ లాంటి వాళ్లకు రాజ్యసభ టిక్కెట్లు ఇచ్చిన టీడీపీ తమను విమర్శించే హక్కు లేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.