ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 79,823 కరోనా పరీక్షల నిర్వహించగా.. 1,657 కొత్త కేసులు నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,52,955కి చేరింది.

తాజా కోవిడ్ కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 6,854కి చేరింది. గడిచిన 24 గంటల్లో 2,155 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నారు.

దీంతో రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,26,344కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 19,757 యాక్టివ్‌ కేసులున్నాయి. నిన్న జరిపిన టెస్టులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 91,01,048 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

ఏపీలో నిన్న అనంతపురం 80, చిత్తూరు 184, తూర్పుగోదావరి 252, గుంటూరు 194, కడప 71, కృష్ణ 225, కర్నూలు 19, నెల్లూరు 62, ప్రకాశం 86, శ్రీకాకుళం 74, విశాఖపట్నం 95, విజయనగరం 66, పశ్చిమ గోదావరిలలో 249 కేసులు నమోదయ్యాయి. కరోనాతో కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.