మూడు రోజుల వ్యవధిలోనే 16 మంది మరణించడం ఆ ప్రాంతంలో ఆందోళన రేకెత్తిస్తోంది. నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామం ఇప్పుడు ఒక్క సారిగా గంభీరంగా మారిపోయింది. స్వల్ప వ్యవధిలో ఇంత మంది చనిపోవడం వెనక కారణాలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ (andra pradesh)లోని పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లా జంగారెడ్డి గూడెం (Jangareddy Goodem) లో మూడు రోజుల వ్యవధిలో 16 మంది మృతి చెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇంత తక్కువ సమయంలో 16 మంది మరణించడం స్థానికులను విస్మయానికి గురి చేస్తోంది. వీరి మృతికి కారణాలు ఏంటనే కోణంలో అధికారులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
గత కొంత కాలం వరకు జంగారెడ్డి గూడెం ప్రాంతంలో అంతా బాగానే ఉంది. ఇటీవలే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇంత మంది మృతి చెందడానికి కారణాలు అన్వేశించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే మృతుల కుంటుబాలను వెళ్లి కలుస్తున్నారు. వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఇందులో దాదాపు 10 మంది కల్తీ సారా తాగడం వల్లనే చనిపోయారని మృతుల కుటుంబీకులు చెబుతున్నారు.
ఈ దర్యాప్తు నిర్వహించడానికి పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ హైమావతి (Public Health Director Haimawati), విజయవాడ జీజీహెచ్ డాక్టర్ల టీమ్ (Vijayawada GGH Doctors Team) జంగారెడ్డి గూడెంకు చేరుకుంది. మృతుల కుటుంబాల ఇళ్లకు ఈ టీం వెళ్లింది. వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకుంది. ఆయా ప్రాంతాల్లో పర్యటించింది. వీరికి మృతి కారణాలు ఏంటనే విషయంలో ఓ అంచనాకు వచ్చారు. వివిధ కారణాలతో వారంతా చనిపోయారని అధికారులు చెబుతున్నారు. కానీ ఇందులో ముగ్గురికి మాత్రం మందు తాగే అలవాటు ఉందని చెప్పారు. ఇందులో పలువురు ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఉన్నారని తెలిపారు. మరి కొందరు 60 ఏళ్లకు పైబడిన వారు ఉన్నరని పేర్కొన్నారు. అయితే మృతుల కుటీంబీకులు మాత్రం తమవారు కల్తీ సారా తాగడం వల్లనే చనిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మరణాల నేపథ్యంలో పలువురు అధికారులు సస్పెన్షన్ కు గురయ్యారు. గురువారం ఒకరు హాస్పిట్ లకు వెళ్లిన కొంత సమయానికి మృతి చెందారు. అయితే ఆయన మృతదేహానికి పోస్టు మార్టం చేయలేదు. ఇలా మృతి చెందిన వారెవరికీ పోస్టు మార్టం నిర్వహించలేదు. దీంతో అసలు మరణాలు ఏ కారణంతో సంభవిస్తున్నాయనే అంశంపై ఓ క్లారిటీకి రాలేకపోతున్నారు. అయితే కల్తీ సారా విక్రయిస్తున్నారనే కుటుంబ సభ్యులు తెలిపడంతో అధికారులు పలు చోట్ల దాడులు నిర్వహించారు. దీంతో పాటు పలు చోట్ల హెల్త్ క్యాంప్ లు చేపడుతున్నారు.
జంగారెడ్డి గూడెం మరణాలపై టీడీపీ (TDP) అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu nayudu) ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజుల వ్యవధిలో 16 మంది మృతి చెందినా.. ఏపీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే ఇటీవల కాలంలోనే నంద్యాలలో స్టూడెంట్లకు ఫుడ్ పాయిజన్ కావడంతో కొంత అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన పైనా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.
