Asianet News TeluguAsianet News Telugu

దిశా డిఐజీగా రాజకుమారి... జగన్ సర్కార్ కీలక నిర్ణయం

16 మంది ఐపీఎస్ అధికారులకు బదిలీ, పదోన్నతిని కల్పిస్తూ వైసిపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

16 IPS officers transfer in andhra pradesh akp
Author
Amaravati, First Published Jul 7, 2021, 11:36 AM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పలువురు ఐపీఎస్ లకు పదోన్నతులు కల్పించడమే కాదు బదిలీలు చేపట్టింది. మొత్తం 16 మంది ఐపీఎస్ అధికారులకు బదిలీ, పదోన్నతిని కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్ ఒక ప్రకటన విడుదల చేశారు. 

విజయనగరం ఎస్పీ రాజకుమారికి డీఐజిగా పదోన్నతి కల్పించారు. ఆమెను దిశా డీఐజీగానే కాకుండా డీజీపీ కార్యాలయంలో అడ్మిన్ డీఐజీగా బాధ్యతలు అప్పగించారు. రాజకుమార్ స్థానంలో విజయనగరం ఎస్పీగా ఎం.దీపికకు నియమించారు. 

ఐపిఎస్ ల బదీలీలు: 

★ సి.హెచ్.విజయరావును నెల్లూరు ఎస్పీగా బదిలీ

★ ఎం.రవీంద్రనాథ్ బాబును తూ.గో. జిల్లా ఎస్పీగా బదిలీ

★ అద్నాన్ నయీమ్ హస్మిని గ్రే హౌండ్స్ కమాండర్‌గా బదిలీ

★ కృష్ణా జిల్లా ఎస్పీగా సిద్ధార్థ్‌ కౌశల్‌ నియామకం

★ సతీశ్‌కుమార్‌కు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అదనపు ఎస్పీగా బదిలీ

★ విద్యాసాగర్‌ నాయుడు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అదనపు ఎస్పీగా పోస్టింగ్‌

★ వై.రిశాంత్ రెడ్డిని గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ అడ్మిన్​గా​ పోస్టింగ్

★ ఎస్ .సతీష్ కుమార్ ను​ స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో అదనపు ఎస్పీగా నియామకం

 ★ గరికపాటి బిందు మాధవ్​ను ఎస్ఈబీ అదనపు ఎస్పీగా బదిలీ

★ తుహిన్ సిన్హాను ఎస్ఈబీ అదనపు ఎస్పీగా బదిలీ

★ పి జగదీష్ ను​ విశాఖపట్నం జిల్లా పాడేరు సహాయ ఎస్పీగా బదిలీ

★ జి కృష్ణకాంత్​ను తూర్పుగోదావరి జిల్లా చింతూర్ సహాయ ఎస్పీగా బదిలీ

★ వి ఎన్ మణికంఠ ఛందోలును విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం అసిస్టెంట్ ఎస్పీగా బదిలీ

★ కృష్ణకాంత్ పాటిల్ ను తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం అసిస్టెంట్ ఎస్పీగా బదిలీ

★ తుషార్ దూడిని విశాఖపట్నం జిల్లా చింతపల్లి అసిస్టెంట్ ఎస్పీగా బదిలీ

 

Follow Us:
Download App:
  • android
  • ios