ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కేసులు ఇవాళ మళ్లీ పెరిగాయి. నిన్న శాంతించినట్లుగానే కనిపించి ఇవాళ మళ్లీ పెరిగాయి. కర్ఫ్యూతో పాటు ఆంక్షలు కట్టుదిట్టంగా అమలు చేస్తండటంతో అవి సత్పలలితాలను ఇస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 15,284 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 16,09,105కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 106 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 10,328కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 8, ప్రకాశం 11, అనంతపురం 9, తూర్పుగోదావరి 9, చిత్తూరు 15, గుంటూరు 5, కర్నూలు 8, నెల్లూరు 9, కృష్ణ 5, విశాఖపట్నం 9, శ్రీకాకుళం 7, పశ్చిమ గోదావరి 10, కడపలో ఒక్కరు చొప్పున మరణించారు.

నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 20,917 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 14,00,754కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 72,979 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,87,49,201కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,98,023 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 1034, చిత్తూరు 1970, తూర్పుగోదావరి 2663, గుంటూరు 802, కడప 436, కృష్ణ 568, కర్నూలు 1387, నెల్లూరు 648, ప్రకాశం 978, శ్రీకాకుళం 991, విశాఖపట్నం 1840, విజయనగరం 555, పశ్చిమ గోదావరిలలో 1412 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.