ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, గుజరాత్ తరహాలోనే ఇక్కడ కూడా రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,398 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 9,05,946కి చేరింది. కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో నిన్న 9 మంది ప్రాణాలు కోల్పోయారు. గుంటూరులో ఇద్దరు, నెల్లూరు ఇద్దరు, కడప, కర్నూలు, ప్రకాశం, విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

వీరితో కలిపి ఇప్పటి వరకు వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,234కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 787 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,89,295కి చేరింది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ఆసుపత్రుల్లో 9,417 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న 31,260 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా.. ఇప్పటి వరకు మొత్తం కరోనా నిర్థారణా పరీక్షల సంఖ్య 1,51,77,364కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో అనంతపపురం 36, చిత్తూరు 190, తూర్పుగోదావరి 28, గుంటూరు 273, కడప 75, కృష్ణ 178, కర్నూలు 96, నెల్లూరు 163, ప్రకాశం 48, శ్రీకాకుళం 51, విశాఖపట్నం 198, విజయనగరం 47, పశ్చిమ గోదావరిలలో 15 కేసులు చొప్పున నమోదయ్యాయి.