ఏపీలో కొత్తగా 1378 కరోనా కేసులు నమోదవ్వగా.. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1,139 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 14,702 మంది చికిత్స పొందుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌‌‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1378 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,13,785కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,877కి చేరుకుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల చిత్తూరులో 2, తూర్పుగోదావరి 1, కడప 1, కృష్ణ 4, నెల్లూరు 1, పశ్చిమ గోదావరిలలో ఒక్కరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 1,139 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 19,85,206కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 59,566 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,67,45,035కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 14,702 మంది చికిత్స పొందుతున్నారు. 

నిన్న ఒక్కరోజు అనంతపురం 22, చిత్తూరు 219, తూర్పుగోదావరి 242, గుంటూరు 101, కడప 61, కృష్ణ 178, కర్నూలు 15, నెల్లూరు 166, ప్రకాశం 119, శ్రీకాకుళం 28, విశాఖపట్నం 69, విజయనగరం 13, పశ్చిమ గోదావరిలలో 145 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

Scroll to load tweet…